పోలీస్ వాహనం ఢీకొని గాయపడ్డ చిన్నారి ప్రణతి మృతి
- రెండు రోజుల క్రితం జరిగిన ఘటన
- చికిత్స పొందుతూ ప్రణతి మృతి
- కామినేని ఆసుపత్రి వైద్యులు వెల్లడి
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఓ చిన్నారిని పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ చిన్నారి ప్రణతి(3) మృతి చెందింది. ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, యాదగిరిగుట్ట పాత నర్సింహస్వామి ఆలయం వద్ద రెండు రోజుల క్రితం ప్రణతిని పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. దైవ దర్శనం అనంతరం దేవాలయం పరిసరాల్లో ప్రణతి, ఆమె తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.